సాయిబాబా భక్తులకు షాక్.. రేపటి నుండి షిరిడి ఆలయం మూసివేత

సాయిబాబా భక్తులకు షాక్.. రేపటి నుండి షిరిడి ఆలయం మూసివేత
x
Highlights

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా సాయి జన్మభూమి వివాదం మొదలయింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా సాయి జన్మభూమి వివాదం మొదలయింది. షిరిడీ సాయినాథుని జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన పత్రీ అని స్థానికులు భావిస్తూ1999లో శ్రీ సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు.

జనవరి19వ తేదీ ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేస్తున్నట్లు సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్న విషయం వాస్తవమేనని ట్రస్టు సభ్యుడు ధ్రువీకరించారు. సాయిబాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లాలోని 'పత్రి'ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. షిరిడీతో సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. కానీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది.

షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలన్నది రాష్ట్ర సర్కార్‌ కుయత్నమని ట్రస్ట్‌ ఆరోపించింది. తొలిసారిగా ఆదివారంనాడు బంద్‌కు పిలుపిచ్చింది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయం మూసివేత నిర్ణయం తీసుకుంది. ఆ రోజునుంచే సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఉత్పన్నమవుతోంది.

లక్షల మంది భక్తులు రావాలా వద్దా అన్న సందేహం నెలకొంది. నిజానికి, మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు అంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories