షిర్డీ భక్తులకు గుడ్‌న్యూస్

షిర్డీ భక్తులకు గుడ్‌న్యూస్
x
షిర్డీ భక్తులకు గుడ్‌న్యూస్
Highlights

సాయిబాబ జన్మస్థానంపై వివాదం నేపధ్యంలో నిరవదిక బంద్ కు పిలుపునిచ్చిన ప్రజలు విరమించారు. మహారాష్ర్ట సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ...

సాయిబాబ జన్మస్థానంపై వివాదం నేపధ్యంలో నిరవదిక బంద్ కు పిలుపునిచ్చిన ప్రజలు విరమించారు. మహారాష్ర్ట సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. పత్రిలో సాయి జన్మించారనేందుకు ఆధారాల్లేవని షిరిడి వాసులు చెబుతున్నారు.

సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన వివాదం నేపధ్యంలో షిరిడీ వాసులు చేపట్టిన నిరవధిక బంద్ ను విరమించారు. మహారాష్ర్ట సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ప్రనీ జిల్లాలోని పాథ్రీ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా ప్రకటించి అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని షిరిడీ వాసులు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి ఆధారాలు లేవని చెబుతున్నారు.

మరో వైపు సీఎం ఠాక్రే ప్రకటనను నిరసిస్తూ నిర్వహించిన షిర్డీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. షిర్డీ ప్రాముఖ్యత తగ్గించరాదని బాబా ఫోటోలతో స్థానికులు ప్రదర్శన నిర్వహించారు. బాబా ఆలయం యధావిధిగా తెరిచి ఉంచారు. బంద్ ప్రభావం భక్తులపై పడకుండా షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చర్యలు తీసుకుంది. యథావిదిగా సాయిబాబా ఆలయం తెరిచి ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. బాబా జన్మస్థలం చెలరేగుతున్న వివాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. షిర్డీ ప్రాముఖ్యత దెబ్బతినకుండా పాథ్రీని అభివృద్ధి చేయాలని కోరారు.

గతంలోనూ బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని షిర్డీవాసులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పాథ్రీలోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పాథ్రీ అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాథ్రీ లోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. బాబా జన్మస్థలం షిర్డీ అని షిర్డీ వాసులు, కాదని పాథ్రీవాసులు వాదిస్తున్నారు. మహారాష్ర్ట సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంట కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories