షీలా దీక్షిత్‌ అంత్యక్రియల ఖర్చు రూ.500

షీలా దీక్షిత్‌ అంత్యక్రియల ఖర్చు రూ.500
x
Highlights

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరిగాయి....

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరిగాయి. అయితే, షీలా దీక్షిత్ ప్రకృతి ప్రేమికురాలు. తన అంత్యక్రియలను ప్రకృతికి హాని తలపెట్టని రీతిలో నిర్వహించాలని ముందే కోరుకున్నారు. అందుకే ఆమె చనిపోయాక భౌతికకాయాన్ని సీఎన్జీ వినియోగించి దహనం చేశారు. సీఎన్జీ అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. గ్యాస్ ఆధారిత దహన ప్రక్రియ కావడంతో కాలుష్యం అన్నమాటే తలెత్తదు. పైగా ఖర్చు, సమయం కూడా చాలా తక్కువ. ఇదే విధానంలో జరిగిన షీలా అంత్యక్రియల ఖర్చు అక్షరాల రూ.500. సాధారణంగా కట్టెలు ఉపయోగించి దహనం చేసినట్లయితే రూ.1,000 ఖర్చవుతుంది. అదికూడా మృతదేహం పూర్తిగా కాలడానికి 10-12 గంటల సమయం పడుతుంది. కానీ, సీఎన్జీ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తే మృతదేహం గంటలో కాలిపోతుంది. అయితే షీలా అంత్యక్రియలు సాదాసీదాగా చేయడాన్ని పలువురు వ్యతిరేకించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories