రాజస్థాన్‌లో గాలీవాన బీభత్సం.. టెంట్‌కూలి 14 మంది మృతి

రాజస్థాన్‌లో గాలీవాన బీభత్సం.. టెంట్‌కూలి 14 మంది మృతి
x
Highlights

రాజస్థాన్‌లో బార్మర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేందుకు వెళ్లిన భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. గాలీవాన బీభత్సం...

రాజస్థాన్‌లో బార్మర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేందుకు వెళ్లిన భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. గాలీవాన బీభత్సం కారణంగా విద్యుత్ తీగలు తెగిపడడంతో 14మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్మర్ జిల్లాలో గుడారాలు కూలి 14 మంది మృతిచెందారు. మరో 100 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అక్కడ గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, వర్షం కారణంగా వాటిపై విద్యుత్‌ తీగలు పడ్డాయి. దీంతో కరెంటు షాకుతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజస్థాన్ లోని బార్మర్ లో స్టాల్లు కూలి మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అటు.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా మృతి చెందిన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని సంతోషించేలోపే బుతుపవనాల ప్రభావంతో గాలీ వాన బీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories