సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు..

సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు..
x
Highlights

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి.. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి.. సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. చిదంబరం తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్ , అభిషేక్ మను సంఘ్వీ వాదనలు వినిపించారు. INX మీడియాలోకి విదేశీ నిధులను అనుమతించిన విషయంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు. 2007లో జరిగిన ఈ వ్యవహారంపై 2019లో విచారణ జరపడం వెనక దురుద్దేశ్యాలు ఉన్నాయన్నారు. కేసులో చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ ... ప్రతిఫలం పొందాయంటూ ఆరోపిస్తున్న సంస్ధలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు విన్నవించారు.

చిదంబరం తరపు న్యాయవాదుల వాదనలను తిప్పికొట్టిన సీబీఐ ... INX మీడియాలోకి విదేశీ నిధులు తరువాత క్రమంలో చిదంబరం కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న సంస్ధల్లోకి షెల్ కంపెనీల ద్వారా మళ్లాయన్నారు. ఇందుకోసం పలు విదేశీ అకౌంట్ల తెరిచారని న్యాయస్ధానానికి వివరించారు. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు అవసరమైనందునే చిదంబరంను అరెస్ట్ చేసినట్టు కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అరెస్ట్‌కు ముందు చిదంబరం కనిపించకుండా పోవడం కలకలం రేపింది. సీబీఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లినా.. ఆయన దొరకలేదు. చివరకు బుధవారం రాత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టితో సీబీఐ కస్టడీ ముగియనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories