సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ
x
Highlights

INX మీడియాలోకి విదేశీ నిధులును అనుమతించిన కేసులో కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబారానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

INX మీడియాలోకి విదేశీ నిధులును అనుమతించిన కేసులో కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబారానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా 2007లో జరిగిన వ్యవహారంపై ఇఫ్పుడు కేసులు నమోదు చేశారని .. ఈడీ ఆరోపిస్తున్న కంపెనీల్లో చిదంబరం వాటాదారుగా లేరంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే కార్తీ చిదంబరంను ప్రశ్నించారని .. సుప్రీం కోర్టు బెయిల్‌కు అనుగుణంగా విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. ఇలాంటి సమయంలో చిదంబరంను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులు పెట్టేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వాదించారు. అయితే INX మీడియాలోకి వచ్చిన నిధులు తిరిగి చిదంబరం కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్ధల్లోకి వచ్చి చేరాయని ఈడీ వాదించింది. విదేశాల్లో పదుల సంఖ్యలో ఖాతాలు గుర్తించామంటూ కోర్టుకు విన్నవించింది. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు కోసమే తాము ప్రయత్నిస్తున్నామని కోర్టుకు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం చిదంబరం పిటిషన్‌ను కొట్టివేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories