logo

మాల్యా నుంచి రూ 1008 కోట్లు రికవరీ

మాల్యా నుంచి రూ 1008 కోట్లు రికవరీ

దాదాపు 9 వేలకోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకుల వద్ద తీసుకుని.. తిరిగి కట్టకుండా విదేశాలకు పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న విజయ్‌ మాల్యా కంపెనీ యూబీఎల్‌ నుంచి ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్ల రికవరీ చేసింది. మాల్యాకు చెందిన యూబీఎల్‌ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ చేసినట్టు తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్‌ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ఈడీ వినతితో తనఖా లేని 74,04,932 యూబీఎల్‌ షేర్లను కోర్టు అటాచ్‌ చేసింది.ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్‌ఏ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్‌ షేర్లను డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్‌ బ్యాంక్‌కు గతంలో నోటీసులు అందాయి. ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ యస్‌ బ్యాంక్‌ కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. దీంతో యూబీఎల్‌ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని యస్‌ బ్యాంక్‌ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్ధానం నుంచి ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి.

లైవ్ టీవి

Share it
Top