గృహ రుణాలు తీసుకునేవారికి ఎస్‌బీఐ శుభవార్త

గృహ రుణాలు తీసుకునేవారికి ఎస్‌బీఐ శుభవార్త
x
Highlights

ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం తగ్గించిన మరుసటి రోజే దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై...

ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం తగ్గించిన మరుసటి రోజే దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై 5 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన నేపథ్యంలో రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. నూతన రేట్లు నిన్నటి(శుక్రవారం) నుంచే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. కాగా గృహ రుణాల మార్కెట్‌లో అత్యధిక మార్కెట్‌ వాటా ఎస్‌బీఐకే

ఉన్నందున దిగువ, మధ్య తరగతి వర్గాలకు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కల్పించడానికి ఇదే సరైన సమయంగా రజనీష్‌కుమార్‌ పేర్కొన్నారు. తమకు పోటీ ఇచ్చే ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ బ్యాంకు డిపాజిట్‌ రేట్లు తక్కువగా ఉన్నాయని, వీటిని ఇంకా తగ్గించాలంటే ఎంసీఎల్‌ఆర్‌ వ్యవస్థలో లెండింగ్‌ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories