ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ పై వేటు

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ పై వేటు
x
Pragya Thakur
Highlights

నిన్న జరిగిన లోక్‌సభ సందర్భంగా మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆమెను పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ నుంచి తొలగించారు.

నిన్న జరిగిన లోక్‌సభ సందర్భంగా మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ పేర్కొన్న ఒక రోజు తర్వాత ఆమెను పార్లమెంటరీ డిఫెన్స్ ప్యానెల్ నుంచి తొలగించారు. నిన్న ఠాకూర్ లోక్ సభలో చేసిన వాఖ్యలకు గాను ఈ రోజు బిజెపి పార్టీ నుండి ఆమెకు తొలగింపు ఉత్తర్వులు చేరుకున్నాయి.

ప్రజ్ఞాను రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన కమిటీలో ఆమె సభ్యత్వాన్ని తొలగించడమే కాక, తదుపరి నోటీసు వచ్చేవరకు ఆమె బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరు కాకూడదని తెలిపారు. పార్లమెంటులో ఒక్కసారిగా దుమారం రేపిన ప్రజ్ఞా వాఖ్యలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం వెల్లడించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (సవరణ) బిల్లు గురించి జరుగుతున్న చర్చలో భాగంగా మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను డిఎంకె సభ్యుడు ఎ రాజా ఉదహరించారు. తనను హత్య చేయాలని నిర్ణయించుకునే ముందు 32 ఏళ్లుగా తనకు మహాత్మా గాంధీపై పగ ఉందని గాడ్సే ఒప్పుకున్నారని ఆయన అన్నారు. గాడ్సే తన సొంత తత్వశాస్త్రం వల్ల గాంధీని చంపాడని ఆయన అన్నారు.

దానికి ప్రతిస్పందనగా, ప్రజ్ఞా ఠాకూర్ "మీరు దేశ్ భక్తికి ఉదాహరణ ఇవ్వలేరు" అని అడ్డుకున్నారు. గాడ్సే దేశభక్తుడని ప్రేరేపించడంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించిన వెంటనే బిజెపి నాయకులు ఆమెను కూర్చోమని కోరారు.

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2006 మాలెగావ్ పేలుడు కేసులో నిందితురాలు. డిఫెన్స్ ప్యానెల్‌లో ఆమె నియామకానికి వ్యతిరేకంగా ఒక గొడవ కూడా జరిగింది, ఎందుకంటే ఆమె చాలా మంది అమాయకులను చంపిన పేలుడు కేసులో నిందితురాలు.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories