కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే సీఎం: సదానంద గౌడ

కొత్త ప్రభుత్వం ఏర్పడితే యడ్యూరప్పే సీఎం: సదానంద గౌడ
x
Highlights

కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో కాంగ్రెస్‌ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు....

కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో కాంగ్రెస్‌ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. సంక్షోభం నుంచి బయట పడేందుకు ఏం చేయాలా అని సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఈ పరిమాణాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. రాజీమానాలకు స్పీకర్ ఆమోదం తెలిపితే ఏం కానుంది ? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఎంత మంది సభ్యులు కావాలి ?

కన్నడ నాట రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఆపరేషన్ కమలం సెగ తగులుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన కనీసం 11 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో సమీకరణాలు మారనున్నాయి. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. రాజీనామాలు చేసిన వారిలో కొందరు బీజేపీలో చేరినా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యా బలం సమకూరనుంది.

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 37, బీజేపీకి 105, బీఎస్పీకి 1, ఇతరులు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 115 మంది ఉండగా బీఎస్పీతోపాటు ఇద్దరు స్వతంత్రులూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి సర్కారు బలం మేజిక్‌ ఫిగర్‌కు దూరంగా పడిపోతుంది.

కర్ణాటక అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని బీజేపీ సంకేతాలు పంపుతోంది. గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. 105 మంది ఎమ్మెల్యేలున్న మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, జనం మాతోనే ఉన్నారని గౌడ చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యడ్యూరప్ప మరోసారి సీఎం అవుతారని సదానంద గౌడ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories