శబరిమలలో మళ్లీ టెన్షన్

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం కాసేపట్లో తెరుచుకోనుంది. ప్రధాన పూజారి, ముఖ్య పూజారి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని...
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం కాసేపట్లో తెరుచుకోనుంది. ప్రధాన పూజారి, ముఖ్య పూజారి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది.
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2018 నాటి తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించారు. నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ తెలిపారు.
Keywords : Lord Ayyappa temple, Sabarimala, Devotees
లైవ్ టీవి
సిరీస్ గెలుపుపైనే గురి
10 Dec 2019 2:10 PM GMTకార్తీ 'దొంగ' ట్రైలర్ వచ్చేసింది
10 Dec 2019 1:56 PM GMTమూడోసారి కొనసాగలేను.. క్రికెట్కు మంచి రోజులు వచ్చాయ్,...
10 Dec 2019 1:44 PM GMT'వెంకీ మామ' సెన్సార్ పూర్తి.. టాక్ ఇలా ఉంది !
10 Dec 2019 1:32 PM GMTఆ జాబితాలో మోదీ తర్వాత కోహ్లీనే...
10 Dec 2019 12:44 PM GMT