అయోధ్యలో అరుదైన దీపాల వెలుగు.. గిన్నీస్ రికార్డ్

అయోధ్యలో అరుదైన దీపాల వెలుగు.. గిన్నీస్ రికార్డ్
x
Highlights

దీపావళి పండగ అంటే చాలు దీపకాంతులతో నగరాలన్నీ వెలిగిపోతుంటాయి.

దీపావళి పండగ అంటే చాలు దీపకాంతులతో నగరాలన్నీ వెలిగిపోతుంటాయి. సత్యభామ నరకాసుర వధ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు నరకాసురుని బాధ తొలిగిందన్న సంతోషంతో ఈ దీపావళిని జరుపుకుంటారు. ఈ పండగను పురస్కరించుకుని అయోధ్య నగరంలోని సరయూ నదీతీరంలో నిర్వహించిన దీపావళి వేడుకలు చరిత్రను సృష్టించాయి.

శనివారం సాయం సంధ్యా సమయంలో సరయు నది తీరంలో ఒక్కసారిగా 6 లక్షలకుపైగా ప్రమిదలు వెలిగించడంతో రామ్‌కీ పౌఢీ ప్రాంతమంతా స్వర్ణ కాంతులతో శోభించాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాయిదాలో వున్న అయోధ్య వివాదం కేసు తీర్పు మరికొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. మూడేళ్ళుగా ఈ వేడుకలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఫిజీ స్పీకర్‌ వీణా భట్నాగర్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అయోధ్య నగరంలో తొలిసారి 2017లో సంవత్సరంలో రామ్‌కీ పౌడీ వద్ద 301,186 ప్రమిదలను వెలిగించారు. 2018లో 4 లక్షల 10 వేల ప్రమిదలు వెలిగించారు. కాని ఈ ఏడాది మాత్రం ఆరు లక్షలకుపైగా దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం, పర్యాటక శాఖ, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ల్లో చోటు సంపాదించింది.

దీపోత్సవంలో కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు, ఈ వేడుకలను చూడడానికి ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీసి అక్కడున్న వారి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించారు.

ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ముఖ్య మంత్రి అయోధ్యను సందర్శించిన దాఖలాలు లేవన్నారు.తాను గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 18సార్లు అయోధ్యను సందర్శించానన్నారు. ఆ ప్రాంత అభివృధి కోసం ఇప్పటి వరకు వందల కోట్ల విలువైన పథకాలను మంజూరు చేశానని ఆయన తెలిపారు. దేశంలో ఉన్న ఏడు ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల్లో మూడు యూపీలోనే ఉన్నాయన్నారు. ఒకే మాట, భారతీయులు కొలిచే దైవం రాముడి జన్మించిన రాజ్యం అయోధ్యనగరం మన రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. రామరాజ్యంలో కుల, మత, జాతి, భాష భేదం లేదని, అదే రాముడి తన పరిపాలనా దక్షతలని కొనియాడారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories