మూడు కేటగిరీలుగా రెడ్‌ జోన్లు‌... లాక్‌డౌన్‌ పై దీదీ కీలక నిర్ణయం

మూడు కేటగిరీలుగా రెడ్‌ జోన్లు‌... లాక్‌డౌన్‌ పై దీదీ కీలక నిర్ణయం
x
mamata banerjee
Highlights

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనాని కట్టడి చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని మమతా చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థను కూడా పునరుద్ధరించడానికి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

అందులో భాగంగానే రాష్ట్రంలోని రెడ్ జోన్‌లను ఏ, బీ, సీ అనే మూడు విభాగాలుగా విభజిస్తామని మమతా మంగళవారం ప్రకటించారు. ఈ మండలాల్లో మరిన్ని సడలింపులు ఇస్తామని ఆమె తెలిపారు. ఇందులోని రెడ్ జోన్ 'ఏ' లో లాక్ డౌన్ సడలింపులు ఏమీ ఉండవని, బీ, సీలలో మాత్రం మరిన్ని ఎక్కువ మినహాయింపులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఇక కంటైనేషన్ జోన్లపై ఎలాంటి మార్పులు విధించబోమని మమతా స్పష్టం చేశారు.

అయితే ఆయా చోట్ల ఏ దుకాణాలను తెరవవచ్చో నిర్ణయించే బాధ్యతను మాత్రం కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించామని మమతా తెలిపారు. మే 21 నుంచి లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు మంజూరు చేస్తామని బెనర్జీ తెలిపారు. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లోని గ్రీన్ జోన్ లలో బస్సులు నడిపేందుకు మమతా సర్కార్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ సమయంలో చిక్కుకొని రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వారిని రాష్ట్రంలోనే ఉండాలని కోరుతామని బెనర్జీ అన్నారు. అటు గత వారం హుగ్లీ జిల్లాలో చోటుచేసుకున్న మత ఘర్షణలను ప్రస్తావిస్తూ బెనర్జీ దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇక సినిమా పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్‌లు వద్దని, కేవలం ఎడిటింగ్‌, డబ్బింగ్‌ వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మాత్రమే చేసుకోవాలని వెల్లడించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు ఇప్పుడే ప్రారంభించే అవకాశమే లేదని మామతా స్పష్టం చేశారు.

ఇక పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ -19 మరణాల సంఖ్య 126 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 110 కొత్త కేసులు నమోదయ్యాయి, దీనితో పచ్చిమ్ బెంగాల్ లో కరోనా కేసుల సంఖ్య 1,363 కు చేరుకుందని రాష్ట్ర వైద్య అధికారులు వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories