ఇవాళ కన్నడ సంక్షోభంలో కీలక మలుపు

ఇవాళ కన్నడ సంక్షోభంలో కీలక మలుపు
x
Highlights

కర్ణాటకం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇవాళ స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. మరి రెబల్స్‌ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారా..? ఆమోదిస్తే బీజేపీ...

కర్ణాటకం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇవాళ స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. మరి రెబల్స్‌ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారా..? ఆమోదిస్తే బీజేపీ యాక్షన్‌ ఎలా ఉండబోతోంది..? ఆమోదించకపోతే గవర్నర్‌ పాత్ర ఏంటి..? కర్ణాటక రాజకీయాలు ఇవాళ మరో కీలక మలుపు తీసుకోబోతున్నాయి. కర్ణాటక సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. గత మూడు రోజులుగా అందుబాటులో లేని స్పీకర్‌ ఇవాళ బెంగళూరుకు రానున్నారు. దీంతో రెబల్స్‌ ఇచ్చిన రాజీనామాలపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి క్యాంపు పాలిటిక్స్‌కు తెరలేపారు. సోమవారం మధ్యాహ్నం వరకు ముంబైలో ఉన్న వారంతా సాయంత్రానికి గోవాకు మకాం మార్చారు.

మరోవైపు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌ నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. రెబల్స్‌కు కేబినేట్‌ మంత్రులుగా ఆఫర్లు ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో సర్కారు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి మరికొందరు కూడా తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయినా కుమారస్వామి మాత్రం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు.అయితే మెజారిటీ కోల్పోయిన కుమారస్వామికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని, బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారివ్వాలని స్పష్టం చేస్తోంది. అలాగే రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్‌ను బీజేపీ కోరింది. ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుంటే, స్పీకర్‌‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు శాసనసభాపక్ష సమావేశానికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాలని బీజేపీ కోరుతుంది. లేకపోతే గవర్నర్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. దీంతో మంగళవారం కన్నడ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటుందని తెలుస్తుంది. ఇవాళ కన్నడ సంక్షోభంలో కీలక మలుపు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories