logo

తనను తొలిసారి ఎత్తుకున్న రాజమ్మ... 48 ఏళ్ల తరువాత ఆమె ఇంటికి రాహుల్ గాంధీ!

తనను తొలిసారి ఎత్తుకున్న రాజమ్మ... 48 ఏళ్ల తరువాత ఆమె ఇంటికి రాహుల్ గాంధీ!
Highlights

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం తనను గెలిపించిన వయనాడ్ వాసులకు కృతజ్ఞతలు...

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం తనను గెలిపించిన వయనాడ్ వాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిన్న శనివారమే కేరళకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ నేడు కొజికోడ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం రిటైర్డ్‌ నర్సు రాజమ్మ వవాతిల్‌ను కలుసుకుని, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు రాహుల్‌ గాంధీ. 48 ఏళ్ల క్రితం తన చేతులతో ఎత్తుకున్న ఓ బిడ్డ ఇప్పుడు తనను చూసేందుకు రావడంతో రాజమ్మ ఆనందంలో మునిగి తేలారు. రాహుల్ జన్మించినప్పుడు ఆమెకు 23 ఏళ్లు. నర్సింగ్‌లో డిగ్రీ చదివిన తర్వాత ఆమె హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. సోనియా గాంధీకి డెలివరీ చేసిన లేబర్ రూమ్ బృందంలో ఆమె కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ జన్మించిన వేళ, తొలిసారిగా ఎత్తుకున్నది ఆమె. నర్సుగా రిటైర్ అయిన తరువాత భర్తతో కలిసి కేరళలోని వయనాడ్ లో ఆమె నివశిస్తున్నారు. ఎన్నికల సందర‍్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమంటూ రాజమ్మ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.


లైవ్ టీవి


Share it
Top