రాజ్యసభ 250వ సమావేశం : వెంకయ్యనాయుడు

వెంకయ్యనాయుడు
x
వెంకయ్యనాయుడు
Highlights

రాజ్యసభ 250వ సమావేశాన్ని ఢీల్లీలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చలను నిర్వహించారు. ఈ చర్చలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పాల్గొని...

రాజ్యసభ 250వ సమావేశాన్ని ఢీల్లీలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక చర్చలను నిర్వహించారు. ఈ చర్చలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయమని, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 1952లో రాజ్యసభ సమావేశమైన నాటి నుంచి ఎన్నో చట్టాలను రూపొందించి అమలు చేసిందని ఆయన తెలిపారు.

లోక్ సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డుగా నిలవకూడదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ మరింత మెరుగ్గా పని చేసేందుకు ఆయన పలు సూచనలను చేశారు. మొట్ట మొదటి రాజ్యసభ సమావేశం 1952 మే 13న జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు రాజ్యసభ 5,466 పనిదినాలు పూర్తి చేసుకోగా, 3,817 బిల్లులను ఆమోదించిందని ఆయన తెలిపారు. 1981 అక్టోబర్ 17న రాజ్యసభ సుదీర్ఘ సమావేశం జరిగిందని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories