చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్

చరిత్ర సృష్టించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
x
Highlights

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. తేజస్‌ మార్క్‌ - 2 లో ప్రయాణించిన రాజ్‌నాథ్‌ సేఫ్‌గా తిరిగి వచ్చారు. దీంతో తేజస్ లో ప్రయాణించిన...

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. తేజస్‌ మార్క్‌ - 2 లో ప్రయాణించిన రాజ్‌నాథ్‌ సేఫ్‌గా తిరిగి వచ్చారు. దీంతో తేజస్ లో ప్రయాణించిన తొలి రక్షణశాఖ మంత్రిగా చరిత్ర సృష్టించారు. తేజస్‌లో ప్రయాణించడం కొత్త అనూభితినిచ్చిందన్నారు. బెంగళూరులో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక తేజస్‌ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ 50 వేల కోట్లను ఖర్చు చేస్తోంది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్‌ మార్క్‌ - 2 సిద్ధమైంది. తేలికపాటి యుద్ధవిమానాల విభాగంలో తయారైన తేజస్‌ను రక్షణశాఖ మంత్రి స్వయంగా పరిశీలించారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తేజస్‌ మార్క్‌-2 లో ప్రయాణించారు.

తేజస్‌ మార్క్‌ - 2 లో ప్రయాణించిన రాజ్‌నాథ్‌ సేఫ్‌గా తిరిగి వచ్చారు. దీంతో తేజస్ లో ప్రయాణించిన తొలి రక్షణశాఖమంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు. తేజస్‌లో ప్రయాణించడం కొత్త అనూభితినిచ్చిందన్నారు. తాను స్వయంగా నడిపిన రెండు నిమిషాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని తెలిపారు. హెచ్‌ఏఎల్‌, డీఆర్‌డీవో, ఇతర ఏజెన్సీలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ఇప్పటికే తేజస్‌ కు సంబంధించిన మొదటి వెర్షన్‌ భారత వాయుసేనలో సేవలు అందిస్తోంది. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి తేజస్‌ మార్క్ - 2 కూడా వాయుసేనలోకి చేరనుంది. ఇది అమెరికా యుద్ధవిమానం ఎఫ్‌ 16 కంటే ఎక్కువ శక్తివంతమైందని హెచ్ఏఎల్‌ నిపుణులు తెలిపారు. గగనతలంలో శత్రువుతో తలపడటంలో తేజస్ మార్క్ - 2 కు తిరుగుండదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories