Top
logo

బ్రేకింగ్ న్యూస్ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి

బ్రేకింగ్ న్యూస్ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతిబ్రేకింగ్ న్యూస్ : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి
Highlights

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడి 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా...

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడి 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నిమిత్తం బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో పడిపోయింది.

ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కనీసం 24 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Web TitleRajasthan: Several dead after a bus falls into a river
Next Story


లైవ్ టీవి