ఎవరేం చేసినా సరే..వెనక్కి తగ్గేది లేదు!

ఎవరేం చేసినా సరే..వెనక్కి తగ్గేది లేదు!
x
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. ఆయనకు నచ్చ చెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు....

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. ఆయనకు నచ్చ చెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పీసీసీ నేతలు ఇప్పటికే పదవులకు రాజీనామా సమర్పించారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త మరో అడుగు ముందుకేశాడు. రాహుల్ మొండి వైఖరికి నిరసనగా ఆత్మహత్యకు యత్నించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట ఉన్న చెట్టెక్కి ఉరి పోసుకునేందుకు సిద్ధమయ్యాడు. రాహుల్ రాజీనామా అంశంపై కార్యకర్తలు, నేతలు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. కార్యకర్త చెట్టు ఎక్కేందుకు యత్నించగా.... అక్కడున్నవారు అడ్డుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories