మోడీ మీ టైం అయిపొయింది : రాహుల్ గాంధీ

మోడీ మీ టైం అయిపొయింది : రాహుల్ గాంధీ
x
Highlights

ఎన్నికల చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది . ఈ నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విరుచుక...

ఎన్నికల చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది . ఈ నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విరుచుక పడ్డారు .. మోడీ మీ టైం ఇక అయిపోయిందని ప్రజలు మీ పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పయారని అన్నారు . మోడికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అయన చాలా దిగులుగా కనిపిస్తున్నారని వాఖ్యానించారు . బుధవారం మధ్యప్రదేశ్ లోని భిండ్ మరియు గ్వాలియర్ లో పర్యటించిన రాహుల్ ఈ వాఖ్యలు చేశారు..

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ మరియు అయన ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చిందంటు అయన మాట్లడరు .. జరిగిన ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ ​శాతం దానికి ఋజువు అని చెప్పుకొచ్చారు .. ప్రధాని మోడీపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఆయన మరోసారి ప్రధాని అవడం అనేది పెద్ద కలే అని రాహుల్ జోస్యం​చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని దొంగలందరూ తమ బ్లాక్​మనీని వైట్​గా మార్చేసుకున్నారని ఆరోపించారు.. వీటిని ఒప్పుకోడానికి మోడికి మొఖం చెల్లదని వాఖ్యానించారు ..

మోడికి పేదలు , సామాన్యులు మరియు మహిళలతో అయన మాట్లాడారని కేవలం విదేశాలకు వెళ్లి బడా బడా పారిశ్రామిక వేత్తలను కలిసి ఆలింగనం చేసుకోవడం మాత్రమే ఆయనకి తెలుసనీ కానీ నేను అలా కాదు పెదలతోనే ఉంటానని స్పష్టం చేసారు . ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫెల్ ఒప్పందం విషయంలో మోడీ మరియు అనిల్ అంబానీ పేర్లు బయటకు తీసుకువస్తామని ధ్వజమెత్తారు . అధికారంలోకి రాగానే వెంటనే డిజిల్ , పెట్రోల్ , జిఎస్టి పరిదిలోకి తీసుకోని వాటి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని అన్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories