సోషల్‌ మీడియాను కాదు .. విద్వేషాన్ని వదలండి: రాహుల్‌

సోషల్‌ మీడియాను కాదు .. విద్వేషాన్ని వదలండి: రాహుల్‌
x
Modi, Rahul gandhi
Highlights

భారత ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న

భారత ప్రధాని మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్విట్టర్‌లో ప్రధాని మోదీకి 5.33 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3 కోట్లపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఫేస్ బుక్ లో నాలుగు కోట్ల మంద్రి మోదీని ఖాతాను లైక్ చేశారు. సెప్టెంబర్‌ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే ఉండడం విశేషం . తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీ సోషల్ మీడియా నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ ఆదివారం నుంచే సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. తాను సోషల్ మీడియాలో లేకపోయినా అందరూ చురుగ్గా పోస్టింగ్‌లు చేయాలని సూచించారు. కానీ ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అయనకు పలువురు అభిమానుల నుంచి ట్వీట్స్ వస్తున్నాయి. నిర్ణయం మార్చుకోవాలని వారు అందులో కోరుతున్నారు..

ఇక విపక్షాల నుంచి మోడీకి కామెంట్స్‌ కూడా వస్తున్నాయి. 'సోషల్ మీడియా ఖాతాలను కాకుండా ద్వేషాన్ని వదులుకోండి' అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రధాని మోదీని ట్యాగ్‌ చేశారు. అయితే రాహుల్ చేసిన ట్వీట్‌కు త్రిపుర ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు బిప్లాబ్ దేబ్ స్పందించారు. "సోనియా గాంధీకి సోషల్ మీడియా ఖాతా లేకపోవడానికి కారణం అదేనా?" అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ తల్లి, ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సోషల్ మీడియాలో లేరు. రాహుల్ గాంధీతో పాటు రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జెవాలా తదితరులు దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories