పుల్వామా దాడి: బీజేపీ ప్రభుత్వానికి రాహుల్‌ మూడు ప్రశ్నలు

పుల్వామా దాడి: బీజేపీ ప్రభుత్వానికి రాహుల్‌ మూడు ప్రశ్నలు
x
పుల్వామా దాడి: బీజేపీ ప్రభుత్వానికి రాహుల్‌ మూడు ప్రశ్నలు
Highlights

పుల్వామా ఉగ్రదాడికి యావద్దేశం వీరజవాన్ల ప్రాణత్యాగానికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన ట్విట్‌ చర్చనీయాంశంగా మారింది....

పుల్వామా ఉగ్రదాడికి యావద్దేశం వీరజవాన్ల ప్రాణత్యాగానికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన ట్విట్‌ చర్చనీయాంశంగా మారింది. పుల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో సరిగా ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ దాడిలో మరణించిన 40 మంది అమర జవాన్లకు నివాళులర్పించిన ఆయన బీజేపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.

పుల్వామా ఉగ్రదాడితో ఎక్కువగా లాభపడింది ఎవరు?. ఈ ఘటనపై జరిపిన విచారణలో ఏం తేలింది? భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ ప్రభుత్వంలోని ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. దాడి ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో వెల్లడించాలని రాహుల్‌ ప్రశ్నించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories