ఆర్‌బీఐని కొల్లగొట్టినా లాభంలేదు: మోదీపై రాహుల్ ధ్వజం

ఆర్‌బీఐని కొల్లగొట్టినా లాభంలేదు: మోదీపై రాహుల్ ధ్వజం
x
Highlights

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌ ద్వారా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సంక్షోభానికి కారణమైన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా...

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌ ద్వారా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సంక్షోభానికి కారణమైన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని, రిజర్వ్ బ్యాంకును కొల్లగొట్టి, పెద్ద మొత్తంలో నిధులు తీసుకున్నంత మాత్రాన ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేరని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ లూటెడ్' అంటూ తన ట్వీట్‌కు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం కేంద్రంపై ధ్వజమెత్తారు. మన ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందనడానికి పేపర్లలో వస్తున్న అడ్వర్‌టైజ్‌మెంట్‌లే నిదర్శనమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. తాము మునిగిపోతున్నాం, కాపాడమంటూ టీఎస్టేట్ యూనియన్లు, మిల్ అసోసియేషన్లు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్లను వార్తాపత్రికల్లో తాను చూశానని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న పరిస్థితికి ఈ ప్రకటనలు అద్దంపడుతున్నాయని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories