Top
logo

QNET scam: బడా సెలబ్రిటీలకు బిగుస్తున్న ఉచ్చు

QNET scam: బడా సెలబ్రిటీలకు బిగుస్తున్న ఉచ్చు
X
Highlights

దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయలు వసూలు చేసి చాలా మందిని మోసం చేసిన క్యూ నెట్ కేసు దర్యప్తు వేగవంతమయింది. ఇప్పటికే...

దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయలు వసూలు చేసి చాలా మందిని మోసం చేసిన క్యూ నెట్ కేసు దర్యప్తు వేగవంతమయింది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ సంస్థను ప్రమోట్ చేసిన ప్రముఖులను విచారించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

క్యూ నెట్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఐదు వేల కోట్లు మోసం చేసినట్లు క్యూనెట్ పై కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే క్యూ నెట్‌లో పెట్టుబడులు పెట్టొద్దంటూ కేంద్రం ప్రకటనలు విడుదల చేసింది. మరోవైపు క్యూ నెట్ ప్రమోట్ చేసిన బాలీవుడ్ సినీ ప్రముఖులు షారుక్ ఖాన్, అనిల్ కపూర్, వివేక్ ఒబేరాయ్,జాకీ ష్రాఫ్, బొమన్ ఇరానీ కి సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Q నెట్ స్కామ్ లో 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బెంగళూర్ లో రూ.2.7 కోట్ల నగదును కూడా సీజ్ చేశామని చెప్పారు. కేసులో Q నెట్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

Next Story