Top
logo

రివర్స్‌ డ్రైవ్‌లో ప్రపంచ ఛాంపియన్

రివర్స్‌ డ్రైవ్‌లో ప్రపంచ ఛాంపియన్
X
Highlights

కారు రివర్స్‌ గేర్ ఎప్పుడెస్తారు వెనక్కి వెళ్లాలనుకున్నప్పుడు. కరెక్టే కదా. మరి అలా బ్యాక్‌ డ్రైవింగ్‌లోనే...

కారు రివర్స్‌ గేర్ ఎప్పుడెస్తారు వెనక్కి వెళ్లాలనుకున్నప్పుడు. కరెక్టే కదా. మరి అలా బ్యాక్‌ డ్రైవింగ్‌లోనే నిత్యం వాహనం నడిపితే రోడ్ల మీద రివర్స్‌లోనే రోజూ కారును డ్రైవ్ చేస్తే అదేంటి అలాంటి డ్రైవింగ్ ఎప్పుడూ చూడలేదే మహా అయితే కొంతదూరం వెళ్లగలం కానీ, ఎక్కువ దూరం, ఎక్కువ రోజులు, రివర్స్ డ్రైవ్ చేయడం కష్టం కదా కానీ పంజాబ్‌లో ఒకతనికి మాత్రం మహా ఇష్టం. అతను రోజూ కిక్కిరిసిన ట్రాఫిక్‌లను, పద్మవ్యూహంలాంటి జాంలను అవలీలగా చేధించుకుంటూ, రివర్స్‌లో కారు నడుపుతూ వాల్డ్‌ ఛాంపియన్‌ అయ్యాడు.

నిజంగా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం రివర్స్‌లా ఉంది. భర్తేమో రివర్స్ డ్రైవింగ్. భార్యేమో రివర్స్ రైటింగ్. రైటింగ్ ఏమో కానీ, రివర్స్ డ్రైవింగ్‌ మాత్రం ట్రై చేయకండి. జీవితం రివర్స్ అయిపోతుంది. మెట్రో సిటీల్లో ట్రాఫిక్‌ జంజాటాల్లో స్ట్రయిట్‌గా నడపాలంటేనే విసుగు. ఫ్రస్టేషన్. అసలు ఈ డ్రైవింగ్‌ ఎంది బాబో అని తల పట్టుకుంటాం. కానీ ఇతనికి మాత్రం డ్రైవింగ్‌ అంటే ప్యాషన్. అదీ కూడా రివర్స్‌లో పోనివ్వడమంటే క్రేజీ ప్యాషన్.

ఇతని పేరు హర్‌ప్రీత్ దేవ్ సింగ్. సొంతూరు పంజాబ్‌లోని భటిండా. బ్యాగ్‌ గేర్‌లో కారునడపడంలో ఇతనికి మామూలు ట్యాలెంట్‌ లేదు. అదిరిపోయేలా డ్రైవ్ చేస్తాడు. పన్నెండేళ్ల నుంచి ఈ రివర్స్ డైరెక్షన్‌లో వాహనం తోలుతున్నాడు. కానీ నీడ్‌ ఈజ్‌ మదర్‌ ఆఫ్‌ ఇన్వెన్షన్ అంటారు కదా. అలా రివర్స్‌లో నడపడం కూడా ఒక అవసరంలోంచే అలవాటు చేసుకున్నాడు దేవ్ సింగ్.

ఒకసారి కారు గేర్‌ స్ట్రక్‌ అయ్యిందట. కేవలం బ్యాక్‌ గేరు మాత్రమే పని చేసిందట. అక్కడ మెకానిక్‌ కూడా లేడట. నిర్మానుష్య ప్రాంతంలో ఎంతసేపని ఉండగలడు. ఇంటికి వెళ్లాలి. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో రివర్స్‌లోనే గమ్యానికి చేరుకున్నాడట. దీంతో బ్యాక్‌ డ్రైవింగ్‌పై హర్‌ప్రీత్‌కు కాన్ఫిడెన్స్ వచ్చిందట. మరి రివర్స్‌లో వెళుతున్న ఇతన్ని చుట్టుపక్కల జనం ఏమీ అనలేదా అనకుండా ఉంటారా. నవ్వారు. విచిత్రంగా చూశారు. దీంతో రహస్యంగా కొన్నిసార్లు రివర్స్‌ ప్రాక్టీస్ వెళ్లాడట.

అలా బ్యాక్‌ డైరెక్షన్‌ లో పర్‌ఫెక్ట్ అయ్యాక, ఇక అదే జోరు కొనసాగించాడు. కిక్కిరిసిన ట్రాఫిక్‌లోనైనా, ప్రమాదకర మలుపులైనా, హైవేలైనా, రివర్స్ గోయింగే. ఇప్పటి వరకు ఇతను 80 వేల కిలోమీటర్ల దూరం నడిపాడట. ఒక్క చిన్న ప్రమాదమూ జరగలేదు. రివర్స్‌ గేర్‌లో గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లగలడు హర్‌ప్రీత్ సింగ్. బ్యాక్‌ డ్రైవింగ్‌కు ఎలాంటి టెక్నిక్సూ లేవు. మామూలుగా ఎలా నడుపుతామో అలాగే. జాగ్రత్తగా అవసరానికి తగ్గట్టు గేర్లు మార్చుకుంటూ వెళ్లాలి.

అయితే ఇక రివర్స్‌లోనే డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి, గేర్ల సెట్టింగ్ కూడా మార్చుకున్నాడు. నాలుగు రివర్స్‌ గేర్లు, ఒక ఫ్రంట్‌ గేర్‌గా చేంజ్‌ చేయించుకున్నాడు. బ్యాక్‌గేర్ డ్రైవింగ్‌పై ఇతనికి ఎంత మోజంటే, చివరికి రివర్స్‌ గేర్ డ్రైవింగ్ స్కూల్‌ కూడా పెట్టేశాడు. చాలామంది ఫార్వర్డ్‌ డ్రైవింగ్‌లో మంచి ట్యాలెంట్‌ ఉన్నవారే. కానీ కారు పార్కింగ్ చేసినప్పుడో, లేదంటే కాస్త వెనకాలకు నడిపినప్పుడో చాలా వీక్‌గా డ్రైవ్ చేస్తారు. అందుకే బ్యాక్‌ డ్రైవింగ్ కూడా చాలా ముఖ్యమంటాడు హర్‌ప్రీత్. రివర్స్‌ డ్రైవింగ్‌లో మెళకువలు నేర్పిస్తున్నాడు. ఇక వీరి ఫ్యామిలీలో మరొకరు రివర్స్ ఉన్నారు. అతని భార్య కూడా రివర్స్‌లో రాసేస్తుంది. ఇంగ్లీష్‌, పంజాబీలో పేరాలకు పేరాలు లిఖిస్తుంది. మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా రివర్సే. హర్‌ప్రీత్‌ ట్యాలెంట్‌కు ప్రశంసలే కాదు అవార్డులూ వరించాయి. రికార్డులూ నమోదయ్యాయి.


Next Story