నీటిలో పడిపోయిన బాలుడు..బాలుడిని కాపాడిని రెస్క్యూ సిబ్బంది

నీటిలో పడిపోయిన బాలుడు..బాలుడిని కాపాడిని రెస్క్యూ సిబ్బంది
x
Highlights

పూనేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణేలోని అనేక ప్రాంతాల్లో ఏకథాటిగా కురిసిన వానలకు నగరమంతా అస్తవ్యస్థంగా మారింది. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో...

పూనేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణేలోని అనేక ప్రాంతాల్లో ఏకథాటిగా కురిసిన వానలకు నగరమంతా అస్తవ్యస్థంగా మారింది. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోతే, మరికొన్ని చోట్ల ప్రజలు నీటిలో కొట్టుకుపోయారు. ఇలా ప్రమాదవశాత్తూ ఓ 7 నెలల బాలుడు వరద నీటిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది బాలుడిని ప్రాణాలతో కాపాడారు.

పూణేలోని మిత్ర మండల్‌ చౌక్‌‌లో‌ దంపతులు నివశిస్తున్నారు. వారి 7 నెలల బాబు నీటిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న పూణే మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు ఫైర్‌ బ్రిగేడ్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. ఓ టబ్బులో బాలుడిని చాకచక్యంగా కాపాడి తాళ్ల సహాయంతో పైకి లాగారు. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. బుజ్జాయి క్షేమంగా బయటపడడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories