కాలేజీ వార్షికోత్సవం..'టై అండ్‌ శారీ డే' థీమ్‌ తో ఆకట్టుకున్న విద్యార్థులు

కాలేజీ వార్షికోత్సవం..టై అండ్‌ శారీ డే థీమ్‌ తో ఆకట్టుకున్న విద్యార్థులు
x
Highlights

అది ఒక గ్రాడ్యు యేషన్ కాలేజి. అందులో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రతి ఏడాదిలో ఏదో ఒక థీమ్ ను...

అది ఒక గ్రాడ్యు యేషన్ కాలేజి. అందులో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రతి ఏడాదిలో ఏదో ఒక థీమ్ ను పెట్టుకున్నట్టుగానే ఈ ఏడాది 'టై అండ్‌ శారీ డే' థీమ్‌ను ఎంచుకొన్నారు. అంతే ఇక విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి ఎవరికి నచ్చిన వస్త్రధారణలో వారు వచ్చారు. అందరి దుస్తులు బాగానే ఉన్నప్పటికీ అందులో ముగ్గురి వస్త్రధారణ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఒక్క సారిగా ఆ ముగ్గురి చుట్టూ గుమిగూడారు. అందరూ సెల్ఫీలు దిగుతూ స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ విద్యార్థులు ఎలాంటి దుస్తులు ధరించి వచ్చారో మీకూ తెలుసుకోవాలని ఉందా..అయితే ఇప్పుడు పూర్తి వివరాల్లోకెళదాం..

పుణేలోని పెర్గూసన్‌ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వారి కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో సాంప్రదాయబద్దంగా చీరలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా వారిని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయినా విద్యా్ర్థులు చీరలు ధరించి రావడంలో ఆశ్యర్యం ఏముంది అని అందరూ అనుకోవచ్చు కానీ అక్కడ చీరలు కట్టుకుంది అమ్మాయిలు కాదు.. అబ్బాయిలు. లింగ సమానత్వం గురించి ఒక సందేశాన్ని చెప్పడానికే ఈ వేషధారణను ఎంచుకొన్నామని ఆ విద్యార్థులు చెబుతున్నారు.

పుణేలోని పెర్గూసన్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు ఈ సాహసం చేసారు. చీరలు ధరించి ఆడవాళ్లలాగా తయారై కాలేజీకి వచ్చారు. వారి వేషధారణను మొదట అక్కడున్నవిద్యార్థులు చూసి నవ్వుకున్నప్పటికీ విషయం తెలిసిన తర్వాత వారితో ఫోటోలు దిగేందుకు ముందుకొచ్చారు.

వారిని ఈ విధంగా డ్రెస్సింగ్ ఎందుకు చేసకున్నారని అడగగా వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆడవారు చీరలు,సల్వార్‌, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్‌, ప్యాంట్‌ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈ సారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వచ్చాం అని చెప్పారు. దాంతో పాటుగానే ఈ కాలేజి ఫంక్షన్ లో లింగ సమానత్వం గురించి అందరికీ తెలియజేయాలని అనుకున్నామని తెలిపారు. ఇక వీళ్లు చేసిన సాహసానికి కాలేజీ యాజమాన్యం వీరిని ప్రశంషలలో ముంచింది. లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని వీరిచ్చిన సందేశానికి కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థులు, చూసిన ప్రతీ ఒక్కరు వారిని మెచ్చుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories