'సూర్యుడు.. 'వాహ్‌ మోదీజీ.. వాహ్‌' అని కూడా అంటాడు

సూర్యుడు.. వాహ్‌ మోదీజీ.. వాహ్‌ అని కూడా అంటాడు
x
Highlights

ప్రపంచం అంతటా టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. దాంతో పాటుగానే సామాజిక మాధ్యమాలు కూడా పెరిగిపోతున్నాయి.

ప్రపంచం అంతటా టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. దాంతో పాటుగానే సామాజిక మాధ్యమాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది వారికి నచ్చిన వీడియోలను ఈ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అయితే అసలు నెటిజన్లు పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా, లేదా ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితిలో వీక్షకులు ఉంటున్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ. అసలు ఆమె ఏం వీడియో పోస్ట్ చేసారు. నెటిజన్ల స్పందనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనివారం కిరణ్ బేడి తన ట్విటర్ ఖాతాలో 'సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసిందని ఆమె ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అంతే ఆమె వీడియోని అలా పోస్ట్ చేయగానే ఆ ట్వీట్ ను అప్పటికప్పుడు 7వేల మందికి పైగా రీట్వీట్‌ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అందులో కొంత మంది నెటిజన్లు అది నిజమైన వార్త కాదని ఇదివరకే వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిందని అంటున్నారు. ఆ వీడియోలో ఓం అనే ఎలాంటి శబ్దం వినిపించదు అని చెపుతున్నారు. మరి కొంత మంది ఏకంగా ''సూర్యుడు.. 'వాహ్‌ మోదీజీ.. వాహ్‌' అని అనడం కూడా ప్రారంభిస్తాడు'' అంటూ కిరణ్‌ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి.

అయితే గతంలో 2018లో నాసా సూర్యుడికి సంబంధించిన కొన్ని విషయాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ట్విట్ లో 'సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడని తెలిపింది. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారని తెలిపారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడిందని ట్వీట్‌ ద్వారా తెలిపారు. అయితే కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్‌ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్‌ చేసి నెటిజన్ల ట్రోల్స్‌ బారిన పడిన వారు కూడా ఉన్నారు. దీంతో ఏ వీడియోలను నమ్మాలో ఏ వీడియోలను నమ్మకూడదో అన్న దానిపై నెటిజన్లు తర్జన భర్జన అవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories