మెప్పించిన ప్రియాంక!

మెప్పించిన ప్రియాంక!
x
Highlights

రాహుల్ సోదరి, యూపీ తూర్పు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విలక్షణ శైలిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం...

రాహుల్ సోదరి, యూపీ తూర్పు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విలక్షణ శైలిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాని మోడీ పై ఆమె మాటల తూటాలు విసురుతూ, బీజేపీ ని వీలు చిక్కినపుడల్లా విమర్శిస్తూ, ప్రియాంక ప్రచారాన్ని సాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఆమెకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఇండోర్ విమానాశ్రయం నుంచి ప్రియాంక కారులో వెళుతుండగా బిజెపి కార్యకర్తలు మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేసి ఆమెను కవ్వించారు. దీంతో ఆమె కారును ఆపించి దిగి, వారి వద్దకు వెళ్లారు. అక్కడున్న వారంతా ఆమె వారితో వాగ్వాదానికి వెళుతున్నారనుకుని ఆమెను ఆప్ ప్రయత్నం చేశారు. అయినా ఆమె ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు ఆమె అకస్మాత్తుగా ఆగిపోయి తమవద్దకు రావడంతో షాక్ అయ్యారు. వారా షాక్ నుంచి తేరుకునే లోగానే వారి వద్దకు నవ్వుతూ వెళ్లిన ప్రియాంక వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్టాఫ్ లక్ చెప్పారు. దీంతో వారు కూడా ఆమెకు ధన్యవాదాలు చెబుతూ నవ్వేశారు.

ఇండోర్ లో గత ముప్ఫై ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కి మద్దతు దార్లు ఎక్కువ. ప్రియాంక ఏదన్నా అని ఉంటే అక్కడ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొనేది. ఆమె అక్కడి వాతావరణాన్ని తేలిక చేయడం పట్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి ఏలాగైనా ఇండోర్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories