logo
జాతీయం

మేం ప్రతిపక్షానికి, వారి పాత్రకు విలువనిస్తాం: మోడీ

మేం ప్రతిపక్షానికి, వారి పాత్రకు విలువనిస్తాం: మోడీ
X
Highlights

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 17వ పార్లమెంట్ తొలి సమావేశాల...

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 17వ పార్లమెంట్ తొలి సమావేశాల ప్రారంభానికి ముందు విపక్షాలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. తాము ప్రతిపక్షానికి, వారి పాత్రకు విలువనిస్తామని తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. సభ్యులు చర్చకు సహకరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోడీ. పార్లమెంట్‌లో ప్రతిపక్షం పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతిపక్షం లోక్‌సభలో తన సభ్యుల సంఖ్య గురించి బెంగ పెట్టుకోకూడదు. వాళ్లు పార్లమెంట్‌లో యాక్టివ్‌గా మాట్లాడి అన్ని విషయాల్లో సహకరించాలని ప్రధాని మోదీ తెలిపారు.

Next Story