కేంద్ర హోంశాఖ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు...

కేంద్ర హోంశాఖ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు...
x
Highlights

కేంద్ర హోంశాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు లభించాయి. మావోయిస్టు సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ...

కేంద్ర హోంశాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు లభించాయి. మావోయిస్టు సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ కొనియాడింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులకు అటవీ, పర్యవరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయి.

ఢిల్లీలో నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమావేశం నిర్వహించారు. దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆయా రాష్ట్రాలు కేంద్ర హోం శాఖను కోరాయి. అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడంపై చర్చించారు.

50లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు తయారు చేయనున్నారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

చత్తీస్‌ గడ్ సరిహద్దులో కొంత నక్సలిజం ప్రభావం ఉందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం ఏమాత్రం లేదన్నారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భాఘెల్, బిహార్ ముఖ‌్యమంత్రి నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories