కూలీ నుంచి గ్రూప్-1 అధికారిణిగా..

కూలీ నుంచి గ్రూప్-1 అధికారిణిగా..
x
మహాలక్ష్మి
Highlights

కృషితో నాస్త దుర్భిక్షం అన్న మాటని అందరూ వినే ఉంటారు.

కృషితో నాస్త దుర్భిక్షం అన్న మాటని అందరూ వినే ఉంటారు. విజయం సాధించడానికి కృషి, పట్టులద ఉంటే చాలు అనుకున్నాది సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితులు సంకల్పానికి అడ్డుకావని నిరూపించింది ఓ యువతి. ఎంతటి కష్టం వచ్చినా సరే వాటినన్నింటినీ అధిగమించి అనుకున్నది సాధించింది. రాత్రి, పగలు శ్రమించి గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది.

పూర్తి వివరాల్లోకెళితే నిన్నటి వరకూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ బాణసంచా పరిశ్రమలో పనిచేసింది విరుద్ నగర్ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వారి కుటుంబానిది. ఎంతో పేద కుటుంబంలో పుట్టిన ఆమె అవసరాల నిమిత్తం పరిశ్రమలో పనులకు వెళ్తూ తన చదువును నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించింది. అటు కూలీ పనులు చేస్తూ, ఇటు చదువుతూ చదువుల తల్లి సరస్వతిగా మారింది.

ఇటీవల తమిళనాడు ప్రభుత్వం 181 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఎక్కవవడంతో 181 పోస్టులకు ఏకంగా రెండు లక్షల 29 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వారిలో 9,442 మంది మెయిన్‌కు అర్హత సాధించారు. 363 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా అందులో టాప్-4 ర్యాంకులో మహాలక్ష్మి నిలిచింది.

అంతే కాదు మొదటి స్ధానంలో కూడా ఒక మహిళ ఉండడం విషేశం. శివగంగైకు చెందిన ఐటీ ఉద్యోగి అర్చన మొదటిస్థానాన్ని దక్కించుకున్నారు. తాను చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి కష్టపడి చదివింది, ఎట్టకేలకు మొదటిస్థానాన్ని సాదించింది. ఇక ఈ సారి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలో సత్తా చాటిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండడం గమనార్హం. టాప్‌–10లో కూడా ఎనిమిది మంది మహిళలకు చోటు దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories