కరోనా ఎఫెక్ట్...పోల్యూషన్ కూ లాక్ డౌన్..

కరోనా ఎఫెక్ట్...పోల్యూషన్ కూ లాక్ డౌన్..
x
Delhi Pollution (File Photo)
Highlights

కరోనా వ్యాప్తి చెందక ముందు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 10 నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. దేశరాజధాని ఢిల్లీలో ప్రతి రోజు కాలుష్యం అంతకంతకు పెరిగిపోయేది.

కరోనా వ్యాప్తి చెందక ముందు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 10 నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. దేశరాజధాని ఢిల్లీలో ప్రతి రోజు కాలుష్యం అంతకంతకు పెరిగిపోయేది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొనేవారు. చిన్న పిల్లలు, ముసలి వారు, గర్భిణులు అనారోగ్యం కాలుష్యం బారిన పడి అనారోగ్యాంపాలయ్యేవారు. ఢిల్లీలో పెరిగిపోయిన వాహణాల పొగ వలన వాయు కాలుష్యం, అలాగే శబ్దకాలుష్యం కూడా పెరిగిపోయింది. కానీ ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పుణ్యమా అని వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అయితే డిల్లీలో శనివారం నాటికి సుమారు 40 కరోనా కేసులు నమోదవడం, వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం, దీంతో స్వీయ నిర్భంధంలో ప్రజలు ఉండడం కాలుష్యం తగ్గడానికి కారణం అయ్యాయి.

వాహనాలు తక్కువ తిరుగుతుండడం, ఫ్యాక్టరీలను తాత్కాలికంగా బంద్ చేయడంతో ద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా బాగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని. కానీ కరోనా కట్టడి మొదలైన తరువాత ఇది ఏకంగా 129కి పడిపోయిందని వాతావరణ శాఖవారు తెలిపారు. ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని కూడా కాలుష్యం పరిమితిని దాటి ఉండేది. కానీ కరోనా కారణంగా కాలుష్యం దాదాపుగా తగ్గింది. అంతే కాదు దేశంలో ఉన్న బెంగుళూరు, చెన్నై, విజయవాడ ఇలా ప్రధాన నరగాల్లో కరోనా పుణ్యమాని కాలుష్యం దాదాపుగా తగ్గిందనే చెప్పుకోవచ్చు.

ఇక పోతే భారత వాతావరణం విభాగం అంచానాలను బట్టి ఢిల్లీలో ప్రస్తుత గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకే పరిమితమయ్యాయి.ఇక కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావించే వూహాన్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జనవరి 23నుంచి వూహాన్ తో పాటు హుబే ప్రావిన్స్ ప్రాంతం మొత్తమ్మీద లాక్ డౌన్ విధించారు. దీంతో అక్కడ కూడా వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. గ్రీన్ హౌస్ వాయువైన నైట్రస్ ఆక్సైడ్ గణనీయంగా తగ్గింది. కచ్చితంగా చెప్పాలంటే నైట్రోజన్ ఆధారిత కాలుష్యం 40శాతం వరకు తగ్గిందని, చైనా మొత్తమ్మీద పార్టిక్యూలేట్ మ్యాటర్ కాలుష్యం 20 నుంచి 30శాతం వరకు తగ్గిందని యూరోపియన్లు స్పేస్ ఎజెన్సీ చెబుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories