ముగిసిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ముగిసిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
x
Highlights

చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. అర్బన్...

చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. అర్బన్ ఏరియాల్లో ఓటేసేందుకు జనం అనాసక్తి చూపించగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మోస్తరుగా ఓటర్లు తరలివచ్చారు. దాంతో మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ పర్సంటేజ్‌ అంతంతమాత్రంగానే నమోదైనట్లు తెలుస్తోంది.

ఇక, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బీహార్‌, కేరళల్లో 5 చొప్పున అసోం, పంజాబ్‌లో నాలుగేసి చొప్పున అలాగే తమిళనాడు, రాజస్థాన్‌, హిమాచల్‌లో రెండేసి స్థానాలకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా, సిక్కింలో మూడు అరుణాచల్‌, ఛత్తీస్‌‌గఢ్‌, మధ‌్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరి, తెలంగాణల్లో ఒక్కో స్థానానికి బైపోలింగ్ ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories