అప్పుడు జగన్ .. ఇప్పుడు కేజ్రీవాల్

అప్పుడు జగన్ .. ఇప్పుడు కేజ్రీవాల్
x
Highlights

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లెక్కలకి అనుగుణంగానే అమ్ ఆద్మీ పార్టీ రేసులో దూసుకుపోతుంది. దాదాపుగా 50...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లెక్కలకి అనుగుణంగానే అమ్ ఆద్మీ పార్టీ రేసులో దూసుకుపోతుంది. దాదాపుగా 50 కిపైగా స్థానాల్లోనే ఆ పార్టీ గెలుపు ఖాయం అయిపోవచ్చు.. కేజ్రీవాల్ ను ఓడించేందుకు బీజేపీ సర్వశక్తుల ప్రయత్నాలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏడూ పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఎలా అయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని విశ్వప్రయత్నాలు చేసింది. మోడీ, అమిత్ షా, బీజేపీ మంత్రులు ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీ ఓటర్లు మాత్రం మళ్ళీ కేజ్రీవాల్ కే పట్టం కట్టారు.

విజయం ఖరారు కావడంతో ఆప్ పార్టీ కార్యలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బాణసంచాలతో, స్వీట్లతో కార్యకర్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కి కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు రాజకీయ నాయకులూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆ పార్టీ విజయం కోసం పని చేసిన ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ''ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు'' అని ట్వీట్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ ప్రశాంత్ కిశోర్ రచించిన రాజకీయ వ్యుహలే పనిచేశాయి. కేజ్రీవాల్ ఎక్కడా జాతీయాంశాలను ప్రస్తావించకుండా ఢిల్లీ ప్రాంత వాసుల అవసరాల గురించి మాత్రమే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యుహకర్తగా వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ ప్రశాంత్ కిశోర్ నే ఎంచుకున్నారు. జగన్ తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. దీనితో ప్రశాంత్ కిశోర్ కి డిమాండ్ బాగానే పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీ 2015 లో సాధించిన మూడు సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ గత ఎన్నికల్లో లాగే ఈ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోవడం విశేషం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories