రెచ్చిపోయిన పోలీస్‌ అధికారి.. అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో కట్టుకున్న భార్యను..

రెచ్చిపోయిన పోలీస్‌ అధికారి.. అక్రమ సంబంధం గురించి నిలదీయడంతో కట్టుకున్న భార్యను..
x
Highlights

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. రూలర్‌గా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కట్టుకున్న భార్యకే చుక్కలు చూపించాడు. పాడుపని...

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు. రూలర్‌గా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కట్టుకున్న భార్యకే చుక్కలు చూపించాడు. పాడుపని చేస్తున్న భర్తను నిలదీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఖాకీ నడిరోడ్డుపై ఆమెను చితకబాదడం హాట్‌ టాపిక్‌గా మారింది. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ఇల్లాలు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న పోలీస్‌ అధికారి నరేంద్ర సూర్యవంశీ పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఇందేంటని ప్రశ్నించిన భార్యను అందరూ చూస్తుండగానే చావగొట్టారు. అధికారి నుంచి ఆమెను కాపాడేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినా గ్యాప్‌ లేకుండా పిడిగుద్దుల వర్షం కురిపించడం వైరల్‌గా మారింది. అనుచితంగా ప్రవర్తించిన పోలీసును అదుపులోకి తీసుకున్నామని విచారణ కొనసాగిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories