logo

వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి: అగ్ర నేతల ఘన నివాళి

వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి: అగ్ర నేతల ఘన నివాళి
Highlights

మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా జాతి ఘన నివాళి అర్పించింది. ఢిల్లీలోని అటల్‌ స్మృతి స్థల్‌ దగ్గర రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన నివాళి అర్పించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా జాతి ఘన నివాళి అర్పించింది. ఢిల్లీలోని అటల్‌ స్మృతి స్థల్‌ దగ్గర రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన నివాళి అర్పించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఇతర అగ్రనాయకులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్రమంత్రులతో సహా వాజ్‌పేయి కుటుంబ సభ్యులు ఆయన్ని స్మరించుకున్నారు. వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నమితా కౌల్‌ భట్టాచార్య, మనవరాలు నిహారిక పలువురు బీజేపీ నేతలు, పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు.

లైవ్ టీవి

Share it
Top