అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్ రహిత భారతం

అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్ రహిత భారతం
x
Highlights

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనేది సాకారమైందని ప్రధాని మోడీ చెప్పారు. 73వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ...

ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనేది సాకారమైందని ప్రధాని మోడీ చెప్పారు. 73వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ అనే సర్దార్ పటేల్‌ కలను నిజం చేసే పనిలో ఉన్నామన్న మోడీ జీఎస్టీ ద్వారా ఒకే దేశం, ఒకే పన్ను చేశామని అలాగే ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు కూడా రావాలని ఆకాంక్షించారు.

ఆర్టికల్‌ 370, 35 ఏ ద్వారా జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి పథంలో వెళ్తుందనుకుంటే వాటిని రాజ్యాంగంలో ఎందుకు శాశ్వతంగా చేర్చలేదని ప్రధాని మోడీ ప్రశ్నించారు. 370 రద్దును పార్టీలకతీతంగా చాలామంది సమర్థించారని కొందరు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వివర్శించారు. తమకు మాత్రం దేశాభివృద్ధే ముఖ్యం అని మోడీ తేల్చిచెప్పారు.

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో సుఖశాంతులతో తలతూగితే అది దేశానికే ప్రేరణగా నిలుస్తుంది. దేశాభివృద్ధిలో గొప్ప పాత్ర పోషిస్తుంది. దేశాభివృద్ధి కోసం చాలామంది తోడ్పడ్డారు. కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దును సమర్థించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవారిని ఈ దేశం ప్రశ్నిస్తోంది. ఆర్టికల్‌ 370, 35ఏ తో జమ్ముకశ్మీర్‌ నిజంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటే దాన్ని శాశ్వతంగా ఎందుకు చేర్చలేదు. తాత్కాలికంగానే ఎందుకు చేర్చారు. గత ప్రభుత్వాలు దీనిపై స్పందించే ధైర్యం కూడా చేయలేదు. తమ రాజకీయ భవిష్యత్‌ కోసం ఆలోచించారు. కానీ మాకు దేశ భవిష్యత్తే ముఖ్యం అన్నారు.

ఉజ్వల భారత్‌ కోసం పేదరికం నుంచి విముక్తి కావాల్సిందే అని మోడీ అన్నారు. గత ఐదేళ్లుగా పేదరికంపై పోరాడామని అందుకు ఫలితాలు వస్తున్నాయని అన్నారు. పేదరికంలో ఉన్న వ్యక్తికి ఆత్మాభిమానం వస్తే ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడరని కష్టనష్టాలను ఎదుర్కోవడంలో అతడికి మించిన వ్యక్తి ఉండడని అన్నారు.

దేశాన్ని ప్లాస్టిక్ నుంచి విముక్తి కలిగించేలా సంకల్పం తీసుకుందామని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని గుర్తుచేసుకుని అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్‌ను ఏరిపారేయాలని ఏ ఇంట్లోనూ ప్లాస్టిక్‌ ముక్క ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్‌ ను నిర్మూలించేందుకు అక్టోబర్ 2 న ఓ బలమైన సంకల్పాన్ని తీసుకుందామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories