పీఎం కిసాన్‌పై కేంద్రం ఉత్తర్వులు

ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. రైతులందరికీ పీఎం-...
ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. రైతులందరికీ పీఎం- కిసాన్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు ప్రారంభించింది. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద రైతులందరికీ రూ.6000 ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించాలని కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందించారు. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. భూమితో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ ఆర్థిక సాయం చేసే యోచనతో ఈ పథకాన్ని అభివృద్ధి చేశారు. నూతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మే 30న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి పారద్శకంగా వ్యవహరించి సరైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, పథకం ఫలాలు వందశాతం సద్వినియోగం అవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.66 కోట్ల మంది లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 3.03 కోట్ల మందికి తొలి విడతగా రూ.2000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మరో 2 కోట్ల మందికి రెండో విడత నగదు కూడా జమైంది.
అయితే ఈ పథకం పరిధిలోకి రాకుండా కొందరిని మినహాయించారు. తమ భూములను కార్యాలయాల కోసం అప్పగించిన వారు, రాజ్యాంగ పరమైన పోస్టుల్లో కొనసాగుతున్నవారు ఈ పథకం పరిధిలోకి రారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న, పదవీవిరమణ పొందిన అధికారులను సైతం తప్పించారు. అంతేకాకుండా రూ. 10 వేల కంటే ఎక్కువ పింఛన్ తీసుకున్న వారితోపాటు ఆదాయపు పన్ను కడుతున్నవారిని కూడా ఈ పథకం నుంచి మినహాయించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పీఎం-కిసాన్ పథకానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT