నేడే కేంద్ర బడ్జెట్.. వారికి భారీ స్థాయిలో ఊరట..?

నేడే కేంద్ర బడ్జెట్.. వారికి భారీ స్థాయిలో ఊరట..?
x
Highlights

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఇవాళ ఇంఛార్జ్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌ పీయూష్‌ గోయల్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు గోయల్‌...

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఇవాళ ఇంఛార్జ్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌ పీయూష్‌ గోయల్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు గోయల్‌ బడ్జెట్‌ చిట్టాను విప్పనున్నారు.. మరో మూడు నెలల్లోపే ఎన్నికలు ఉండడంతో సంప్రదాయానికి అనుగుణంగా తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో.. ప్రత్యేక తాయిలాలు ఉంటాయని భావిస్తున్నారు. పంటల బీమాపై ప్రీమియాన్ని రద్దు చేయడం, పంట రుణాలపై వడ్డీ రద్దు తదితర చర్యలు ప్రకటించే అవకాశాలున్నాయి. వ్యవసాయం, పరి శ్రమలు, ఐటీ సెక్టార్, మధ్యతరగతి వర్గాలకు భారీ స్థాయిలో ఊరట కల్పిస్తారని అనుకుంటున్నారు.

వివిధ రకాల సబ్సిడీల స్థానంలో నగదు ప్రయోజనం అలాగే గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి నగదు ప్రయోజనం లాంటివి ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు తెలంగాణలో మాదిరిగా నేరుగా నగదును అందించడం లేదా వడ్డీ రహిత సాగు రుణాలను ప్రకటించే అవకాశాలున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో, రైల్వేలు, రోడ్లు, పోర్టు రంగాల్లో వ్యయం 7 నుంచి 8 శాతం పెంచడానికి అవకాశం ఉంటుందని ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories