Petrol Price Hike in India: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol Price Hike in India: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
x
Highlights

Petrol Price Hike in India: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇంధన సంస్థలు మాత్రం కనికరించడం లేదు....

Petrol Price Hike in India: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇంధన సంస్థలు మాత్రం కనికరించడం లేదు. సుమారు మూడు నెలల లాక్ డౌన్ అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూనే వచ్చాయి. ఆదివారం సామాన్యులకు కాస్త ఊరటను ఇచ్చి.. మరోసారి పెంపును మొదలుపెట్టాయి.

రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో మార్కెటింగ్‌ కంపెనీలు ఆయిల్‌ ధరలను పెంచుతున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారుల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు..

ఢిల్లీ : పెట్రోల్‌ రూ.80.43; డీజిల్ రూ.80.53

ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83

చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72

హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69

విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19

Show Full Article
Print Article
More On
Next Story
More Stories