పంచాయతీ కార్యాలయం ముందే దహన సంస్కారాలకు ఏర్పాట్లు..

పంచాయతీ కార్యాలయం ముందే దహన సంస్కారాలకు ఏర్పాట్లు..
x
Highlights

చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉండవు. ఉన్నా.. వాటి వద్ద ఎటువంటి సౌకర్యాలు కల్పించరు. ఎవరైనా గ్రామంలో చనిపోతే, సంబంధీకులు ఆ శ్మశానానికి చేరుకొని...

చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉండవు. ఉన్నా.. వాటి వద్ద ఎటువంటి సౌకర్యాలు కల్పించరు. ఎవరైనా గ్రామంలో చనిపోతే, సంబంధీకులు ఆ శ్మశానానికి చేరుకొని అప్పటికప్పుడు దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేసుకుంటుంటారు.

ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే, స్మశానవాటికలు సరిగ్గా లేక, మృతి చెందిన వారికి ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో తెలియక మృతుల కుటుంబాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రా,కర్నాటక సరిహద్దులోని గదగ్‌ జిల్లా ధారవాడ తాలూకా పరిధిలోని పాతలగేరి గ్రామంలో ఇటువంటి పరిస్థితే చోటు చేసుకుంది. స్మశాన వాటికను అభివృద్ధి పరచాలని గత నాలుగు దశాబ్దాలుగా గ్రామస్తులు ఆందోళనలు, పోరాటాలు చేసి చేసి అలసిపోయారు. అధికారుల తీరుపై ఆగ్రహించిన గ్రామస్థులు శుక్రవారం ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఓ వ్యక్తి దహన సంస్కారాల కోసం ఏర్పాట్లు చేసి తీవ్ర నిరసన తెలిపారు. గ్రామంలో 3వేలకు పైగా జనసంఖ్య ఉన్నా స్మశానవాటిక లేకపోవడంతో శవాన్ని తీసుకుని కిలోమీటర్ల కొద్దీ వెళ్ళాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం దెబ్బకు మేల్కొని వెంటనే సంబంధిత తాలూకా తాహసీల్దారును ఘటనా స్థలానికి పంపి పరిస్థితిని సమీక్షించింది. మూడు నెలల్లోగా స్మశానవాటికను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఎట్టకేలకు శాంతించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories