ఇవాళ పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ పట్టు..

ఇవాళ పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ పట్టు..
x
ఇవాళ పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్ సమావేశాలు
Highlights

ఇవాళ్టి నుంచి బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఏప్రిల్ 3 వరకూ 22 రోజులు కొనసాగుతాయి. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లపై కేంద్రాన్ని...

ఇవాళ్టి నుంచి బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఏప్రిల్ 3 వరకూ 22 రోజులు కొనసాగుతాయి. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు ముందే చెప్పాయి. దీంతో ఈ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశం ఉంది.

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాంకులు దివాలా తీయడం, ఖనిజ సవరణ చట్టాలు-2019 ఆర్డినెన్స్ లను కూడా ఉభయసభల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సరోగసీతో పాటు పలు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో మోడీ సర్కారుపై ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి. రెండు సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశం ఉంది. హోంమంత్రి అమిత్‌ షాను రాజీనామా చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు సభలో కూడా తన డిమాండ్‌ను కొనసాగించనున్నారు. లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో అభిషేక‌ మను సింఘ్వితో పాటు పలువురు సీనియర్ నాయకులు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. ఢిల్లీ అల్లర్లలో పోలీసుల పాత్రపై కూడా ఇప్పటికే పలు విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు ఇరు సభల్లో మరోసారి మోడీ, అమిత్‌ షాలను టార్గెట్‌ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories