పుత్రికోత్సాహం..కూతురి బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించేందుకు..

పుత్రికోత్సాహం..కూతురి బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించేందుకు..
x
Highlights

ఆమె దేశానికి ఆర్థిక మంత్రి. అయినా తల్లిదండ్రులకు మాత్రం కూతురే. కేంద్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న కూతురుని చూసి మురిసిపోయారు. పార్లమెంటులో కూతురి...

ఆమె దేశానికి ఆర్థిక మంత్రి. అయినా తల్లిదండ్రులకు మాత్రం కూతురే. కేంద్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న కూతురుని చూసి మురిసిపోయారు. పార్లమెంటులో కూతురి బడ్జెట్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలన్న ఆశతో వృద్ధాప్యాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చేశారు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు. పార్లమెంటు లోపల సందర్శకుల గ్యాలరీలో కూర్చొని ఆసక్తిగా తిలకించారు.

కేంద్ర ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా ఘనత సాధించిన నిర్మలా సీతారామన్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించేందుకు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా నిర్మల తల్లిదండ్రులిద్దరూ పార్లమెంటుకు వచ్చారు. వారి రాకతో పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.

నిర్మల తల్లిదండ్రులు నారాయణ్ సీతారామన్, సావిత్రి సీతారామన్ రాకను గమనించిన పార్లమెంటు సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. దీంతో తమ కూతురు బడ్జెట్ ప్రవేశపెట్టే మధుర క్షణాలను పార్లమెంటు లోపల సందర్శకుల గ్యాలరీలో నుంచి తనివితీరా ఆస్వాదించారు ఆ తల్లిదండ్రులు.

మరోవైపు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేసులో తీసుకొచ్చే సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు. రాజముద్ర కలిగిన ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలు పార్లమెంటుకు తీసుకురావడం ద్వారా ఆమె సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories