Top
logo

పుట్టిన బిడ్డకు 'మిరాజ్‌' అని నామకరణం చేసిన యువజంట

పుట్టిన బిడ్డకు
X
Highlights

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు మంగళవారం...

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మిరాజ్‌ పేరు మారుమోగుతూ ఉంది. ఇది ఎంత అంటే.. నిన్న అదే సమయానికి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మహావీర్‌ సింగ్‌, సోనం సింగ్‌ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు.

దీంతో మిరాజ్‌ యుద్ధ విమానాల దాడి నేపథ్యంలో ఆ బిడ్డకు మిరాజ్‌ రాథోడ్‌ సింగ్‌ అని నామకరణం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు తల్లిదండ్రులు. అంతేకాకుండా తమ బిడ్డను ఆర్మీలోనే చేర్పిస్తామని తండ్రి ఎస్ఎస్‌ రాథోడ్‌ తెలిపాడు. నవశిశువుకు మీరాజ్‌ అని పేరుపెట్టడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తంచేశాడు. ఇక ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Next Story