Top
logo

ఆల్కహాల్ వాసన రావడంతో శానిటైజర్ ను తాగేసిన ఖైదీ.. మృతి!

ఆల్కహాల్ వాసన రావడంతో శానిటైజర్ ను తాగేసిన ఖైదీ.. మృతి!
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా శానిటైజర్లు వాడుతున్న సంగతి తెలిసిందే. అల్కాహాల్ కంటెంట్ ఉన్న...

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా శానిటైజర్లు వాడుతున్న సంగతి తెలిసిందే. అల్కాహాల్ కంటెంట్ ఉన్న వీటిని చేతికి రాసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడం తగ్గించవచ్చు. ఇలాగే జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో అపశృతి చోటు చేసుకుంది. శానిటైజర్ ఆల్కాహాల్ వాసన రాడంతో దాన్ని తాగిన ఓ ఖైదీ మరణించాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది.

రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్ ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ శానిటైజర్ ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు.



Web TitlePrisoner Dies In Kerala After Allegedly Mistaking Sanitiser For Alcohol
Next Story


లైవ్ టీవి