గుజరాత్ పై పాక్ గురి..తీర ప్రాంతాల్లో హై అలర్ట్

గుజరాత్ పై పాక్ గురి..తీర ప్రాంతాల్లో హై అలర్ట్
x
Highlights

సముద్రమార్గం గుండా పాకిస్థాన్‌ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడే ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గుజరాత్‌ తీరం వెంబడి భద్రతను...

సముద్రమార్గం గుండా పాకిస్థాన్‌ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడే ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గుజరాత్‌ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌‌, సర్‌ క్రీక్‌ ప్రాంతం నుంచి పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్‌ తీర ప్రాంత సిబ్బందికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. గుజరాత్‌ సహా ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిపి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేస్తున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. భారత నావికాదళానికి చెందిన నౌకలపై దాడులు జరిపేందుకు వీరికి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల సమాచారం మేరకు భారత సరిహద్దు భద్రతా సిబ్బంది, తీర ప్రాంత సిబ్బంది అప్రమత్తమయ్యారు. గుజరాత్‌లోని అన్ని నౌకాశ్రయాలకు హైఅలర్ట్‌ ప్రకటించారు. కండ్లా పోర్టులో భద్రతను పెంచారు. తీరం వెంబడి భద్రతాసిబ్బంది భారీగా మోహరించారు. గోవా తీరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇవాళ తమిళనాడులోని కోయింబత్తూర్‌లో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో తమిళనాడు పోలీసులు కూడా పాల్గొన్నారు. కోయింబత్తూర్‌ జిల్లాలో మొత్తం ఐదు చోట్ల తనిఖీలు చేసి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories