Covid-19: మరోసారి తన దుర్భుద్ధిని బయటపెట్టిన పాక్ ...

Covid-19: మరోసారి తన దుర్భుద్ధిని బయటపెట్టిన పాక్ ...
x
SAARC COVID-19 Meet
Highlights

ఈ నేపధ్యంలో సార్క్ వీడియో కాన్ఫరెన్స్‌‌లో భాగంగా పాకిస్థాన్ కశ్మీరు అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తింది. పాకిస్థాన్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి జఫర్ మీర్జా ఈ వీడియో

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. నాలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం అంతట విజృంభించింది. మొదట్లో చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కరోనా ఇతర దేశాలకు విస్తరించింది. అయితే ఈ వైరస్ ని అంతా కలిసి కట్టుగా ఎదురుకోవాలని భారత ప్రధాని మోదీ దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘానికి (సార్క్) సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీతో సహా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలీహ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ, భూటాన్ రాజు లోటే ట్షెరింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గానిస్థాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ, పాకిస్థాన్ నుంచి ప్రధాని ఇమ్రాన్‌కు ఆరోగ్యశాఖ తరపున ప్రత్యేక అసిస్టెంట్ జఫర్ మిర్జా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో ఎలా కరోనాని కట్టడి చేయాలన్న అంశాలపై చర్చించారు..

ఈ నేపధ్యంలో సార్క్ వీడియో కాన్ఫరెన్స్‌‌లో భాగంగా పాకిస్థాన్ కశ్మీరు అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తింది. పాకిస్థాన్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి జఫర్ మీర్జా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి జాఫర్ మీర్జా మాట్లాడుతూ.. "జమ్మూ కాశ్మీర్ నుండి COVID-19 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.. ఆరోగ్య, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తక్షణమే జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఆంక్షలన్నిటినీ ఎత్తివేయాలని సూచించారు. అంతేకాకుండా కమ్యూనికేషన్లను పునరుద్ధరిస్తే ప్రజలకు సమాచారం అందుబాటులోకి వస్తుందని, మందుల పంపిణీకి అవకాశం కలుగుతుందని" మీర్జా పేర్కొన్నారు. కరోనా అంశాన్ని అడ్డుగా పెట్టుకొని పాకిస్థాన్ కశ్మీర్‌లోని ఆంక్షలపై ముడిపెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories