Top
logo

పిఓకెలో పాకిస్థాన్ దౌర్జన్యాలు..పాకిస్థాన్ ఆగడాలకు కెమెరాకు చిక్కిన ఆధారాలు

పిఓకెలో పాకిస్థాన్ దౌర్జన్యాలు..పాకిస్థాన్ ఆగడాలకు కెమెరాకు చిక్కిన ఆధారాలు
Highlights

శాంతి జపం చేస్తున్న పాకిస్థాన్ అసలు రూపం...పిఓకెలో ఆగడాలు... ప్రజలపై దాడులు.... ఇంత వరకు ప్రపంచం దృష్టికి...

శాంతి జపం చేస్తున్న పాకిస్థాన్ అసలు రూపం...పిఓకెలో ఆగడాలు... ప్రజలపై దాడులు.... ఇంత వరకు ప్రపంచం దృష్టికి రాని...పాకిస్థాన్ కుట్రలు...హెచ్ఎంటీవీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్నది. పాక్ పద్ధతి మారలేదు. అంతర్జాతీయంగా భంగపడ్డా బుద్ధి రాలేదు. ప్రశాంతంగా ఉన్న పిఓకెలో భారత ప్రజలపై ఎడతెగని దాడులు చేస్తున్నది. కవ్వింపునకు దిగుతున్నది. అది అత్యంత ఆహ్లాదరమైన ప్రాంతం సట్లెజ్ నది ఒడ్డున ఉన్న గ్రామం పేరు టట్టా పానీ పిఓకెకు అతి సమీపంలో ఉన్న గ్రామం. ఇప్పుడు పాక్ దృష్టి టట్టాపానీపై పడింది. పాక్ ఆర్మీతో కలిసి అక్కడి పోలీసులు గుంపులుగా దాడులకు దిగింది.

ఆత్మరక్షణ కోసం పాక్ ఆర్మీపై టట్టాపానీ ప్రజల తిరుగుబాటు

అందుకు ప్రతిగా టట్టా పానీ ప్రజలు ఆత్మరక్షణ చేసుకుంటూ పాకిస్థాన్ ఆర్మీ మీద తిరుగబడ్డారు. మొదటగా ఆర్మీ దాడులకు దిగగా, ఆ ఆగడాలను, వేధింపులను తట్టుకోలేకే ఈ చర్యలకు పాల్పడ్డారు. మా మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేం కూడా వాళ్ళని ఎదుర్కోవాడానికి ముందుకు కదులుతున్నాం అంటూ వాళ్ళంతా ఎదురు దాడికి దిగారు.లైవ్ టీవి


Share it
Top