చిదంబరానికి బెయిల్‌ లభిస్తుందా ?

చిదంబరానికి బెయిల్‌ లభిస్తుందా ?
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ హైడ్రామా వద్ద ఢిల్లీలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో సుమారు 27 గంటల హైడ్రామాకు తెరపడింది. తర్వాత ఏం జరుగుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ హైడ్రామా వద్ద ఢిల్లీలోని ఆయన నివాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో సుమారు 27 గంటల హైడ్రామాకు తెరపడింది. తర్వాత ఏం జరుగుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. చిదంబరానికి బెయిల్‌ లభిస్తుందా ? సీబీఐ కోర్టు ఏం చేయనుంది ? ఈడీ ఏవిధంగా వ్యవహరించనుంది ? తదితర ప్రశ్నలు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

చిదంబరాన్ని అరెస్ట్ చేసిన 24 గంటల లోపు వారు ఆయన్ను కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది. ఒకవేళ చిదంబరం తనకు అనారోగ్యానికి సంబంధించి మందులు తనతో ఉంచుకోవాలన్నా కూడా సీబీఐ అధికారుల అనుమతి తప్పనిసరి. ఆయనకు ఎలాంటి పుస్తకాలు కూడా లభించవు. మరోవైపు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన సుప్రీంకోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ కూడా ఇప్పుడు వృధాయే. సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది కాబట్టి ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో మళ్లీ కొత్తగా బెయిల్‌ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిదంబరానికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడం డౌట్‌గానే కనిపిస్తోంది. అదే సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తాము చిదంబరాన్ని విచారించాల్సి ఉంటుందని సీబీఐ పిటిషన్ దాఖలు చేస్తే.. సీబీఐ కోర్టు ఆయన్ను14 రోజుల కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ రెండు వారాలతో కథ ముగిసిపోదు. సీబీఐ కస్టడీ ముగిసిన వెంటనే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్‌పై విచారించేందుకు చిదంబరాన్నితమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఈడీ కోరికను మన్నించి మరో 14 రోజులు వారి కస్టడీకి ఇస్తే.. సుమారు 28 రోజుల పాటు చిదంబరం విచారణ సంస్థల కస్టడీలోనే ఉండక తప్పదు. ఒకవేళ సీబీఐ, ఈడీలకు చెరో వారం చొప్పున కస్టడీకి ఇచ్చినా కనీసం 15 రోజుల పాటు ఆయనకు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories